- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేస్తోంది.

దిశ, శేరిలింగంపల్లి : డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేస్తోంది. మాదాపూర్ శిల్పకళా వేదికలో ఈగల్ ఫోర్స్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన "పిల్లల భద్రత – డ్రగ్స్‌కు అడ్డుకట్ట" కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, రాష్ట్ర డీజీపీ, నగర పోలీస్ కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి ప్రత్యేక అవేర్‌నెస్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలకు మరింత వేగం పెంచుతోందని అన్నారు. శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల్లో, ముఖ్యంగా యువతలో మాదకద్రవ్యాలపై చైతన్యం పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా విద్యార్థులు, యువత, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రచార వాహనాలను ప్రారంభించారు. ఈ వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ డ్రగ్స్ దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నాయి. డ్రగ్స్ రహిత తెలంగాణ సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, అనుమానాస్పద మాదకద్రవ్యాల కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.






