- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణాపాయ స్థితిలో ఉన్న 62 ఏళ్ల వ్యక్తిని కాపాడిన వరంగల్ మెడికవర్ వైద్యులు
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేరిన 62 ఏళ్ల వ్యక్తికి మెడికవర్ హాస్పిటల్స్, వరంగల్ వైద్యులు అత్యాధునిక చికిత్స అందించి కొత్త జీవితం ప్రసాదించారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేరిన 62 ఏళ్ల వ్యక్తికి మెడికవర్ హాస్పిటల్స్, వరంగల్ వైద్యులు అత్యాధునిక చికిత్స అందించి కొత్త జీవితం ప్రసాదించారు. శుక్రవారం అమెరికా హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డా. అభిజాన్ ఎస్. మాట్లాడుతూ, తలకు తీవ్ర గాయం, ఛాతీ ఎముకలు విరగడం, ఊపిరితిత్తులు కుంచించుకుపోవడం లాంటి తీవ్ర పరిస్థితిలో హాస్పటల్కు పేషెంట్ వస్తే వెంటనే మెడికల్ వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స చేస్తూ అత్యంత ప్రమాదకరమైన మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ (సూపర్‌బగ్) న్యూమోనియా సోకినప్పటికీ వైద్య బృందం సమిష్టి కృషితో రోగిని పూర్తిగా కోలుకునేలా చేశామన్నారు.
ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా...
ప్రమాదం కారణంగా రోగి ఊపిరితిత్తుల పనితీరు తీవ్రంగా దెబ్బతిందన్నారు. ఛాతీలో పేరుకున్న గాలిని తొలగించేందుకు ప్రత్యేక ఛెస్ట్ డ్రెయిన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం సుమారు 15 రోజుల పాటు వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించామన్నారు. తీవ్రమైన రోడ్డు ప్రమాదాల్లో సరైన సమయంలో ట్రామా కేర్, ఆధునిక ఐసీయూ సదుపాయాలు, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సేవలు, నిపుణుల సమన్వయంతో కూడిన మల్టీడిసిప్లినరీ వైద్యం అందితే ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా రోగులను కాపాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రిటికల్ కేర్ ఫిజీషియన్ డా. లక్ష్మీ దీపక్ తదితరులు పాల్గొన్నారు.






