- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదాయానికి మించిన ఆస్తులు... పీసీబీ జోనల్ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు
తిరుపతి పీసీబీ కార్యాలయం జోనల్ అధికారి యుగంధర్ మునిప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆయనపై ఆరోపణలున్నాయి...

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి పీసీబీ కార్యాలయం (Tirupati Pcb Office) జోనల్ అధికారి యుగంధర్ మునిప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు(Assets disproportionate to income) ఉన్నట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు చాణక్యపురి కాలనీ(Kurnool Chanakyapuri Colony)లోని మునిప్రసాద్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే పలు రకాల రికార్డులను అధికారులు పరిశీలించారు. స్థానిక నివాసంతో పాటు ఆయనకు సంబంధించి మరికొన్ని ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చేసిన సోదాల్లో పలు రికార్డులు, డైరీలు, ఇతర కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన సర్వీసు కాలంలో సంపాదించిన స్థిర, చరాస్తుల విలువ, ప్రభుత్వ లెక్కల్లో ఉన్న ఆదాయానికి మధ్య భారీగా తేడాలున్నట్లు గుర్తించినట్లు సమాచారం. బీనామీ ఆస్తులు, బంగారంలాంటి పూర్తి వివరాలు ప్రకటించాల్సి ఉంది. ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తుండటంతో పీసీబీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.






