- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.

దిశ, ఇబ్రహీంపట్నం: ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 24వ తేదీ రాత్రి 10:30 గంటల సమయంలో ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్‌లో తులిప్స్ హోటల్ సమీపంలో సుమారు 50 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి సాగర్ రోడ్డును దాటుతుండగా, తుర్కయంజాల్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు అతివేగంగా వస్తున్న గుర్తుతెలియని ఆటో ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, బాధితుడిని తొలుత బీఎన్ రెడ్డిలోని భృంగి ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 11 గంటలకు అతడు మృతి చెందాడు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. అతని వివరాలు తెలిసిన వారు ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి సమాచారం అందించాలని పోలీసులు కోరారు.






