కడప అల్మాస్ పేట ఘటన నిందితుడు మళ్లీ అరెస్ట్.. భారీగా పోలీసుల మోహరింపు

by Vemula.Srinu Prasad |

కడప అల్మాస్ పేట ఘటన నిందితుడు రియాజ్‌ను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు....

కడప అల్మాస్ పేట ఘటన నిందితుడు మళ్లీ అరెస్ట్.. భారీగా పోలీసుల మోహరింపు
X

దిశ, వెబ్ డెస్క్: కడప అల్మాస్ పేట ఘటన(Kadapa Almaspet incident) నిందితుడు రియాజ్‌(Accused Riyaz)ను పోలీసులు మళ్లీ అరెస్ట్(Arrest) చేశారు. బెయిల్‌పై విడుదలైన ఆయనను టూ టౌన్ పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. జైలు నుంచి బయటకు రాగానే రియాజ్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో రియాజ్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్మాస్ పేట ఘటనకు తమ కుమారుడు రియాజ్‌కు సంబంధం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గంజాయి కేసులో..

గతంలో నమోదైన గంజాయి కేసులో రియాజ్‌ను అరెస్ట్ చూపించారని ఆరోపించారు. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో రియాజ్ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేయడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారని తెలిపారు. తన కొడుకుపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని, రెండు నెలలుగా జైల్లో ఉంచారన్న రియాజ్‌ తల్లి ఆరోపించారు. కనీసం ముఖం కూడా చూపించకుండా మళ్లీ అరెస్ట్ చేశారని రియాజ్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు కడప సెంట్రల్ జైలు వద్ద భారీగా మోహరించారు.

Next Story