- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
by Taduka Kalyani |
వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ సంబంధిత అధికారులకు సూచించారు.

X
దిశ, నర్సాపూర్ : వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతిగృహంలోని వంటశాలను, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకొని పాఠశాలకు, తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ అధికారి సంధ్య, సానిటరీ ఇంచార్జ్ మురళీమోహన్, వార్డు అధికారి ఉదయ్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Next Story






