రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోండి.. మర్పల్లి మండల రైతులకు సూచన

by Taduka Kalyani |

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'రైతు భరోసా' పథకం కింద 2026 వానాకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించి మర్పల్లి మండలంలోని రైతులకు కీలక సూచనలు జారీ అయ్యాయి.

రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోండి.. మర్పల్లి మండల రైతులకు సూచన
X

దిశ, మర్పల్లి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'రైతు భరోసా' పథకం కింద 2026 వానాకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించి మర్పల్లి మండలంలోని రైతులకు కీలక సూచనలు జారీ అయ్యాయి. కొత్తగా భూమి హక్కులు పొందిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు. గత జూన్ 15, 2026 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు (PPB) పొందిన రైతులు మాత్రమే ఈ దరఖాస్తు ప్రక్రియకు అర్హులు. అర్హులైన రైతులు తమ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు సమర్పించడానికి జూలై 5, 2026ని చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ లోపు రైతులు తమ దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే రైతులు కింద పేర్కొన్న పత్రాలను జతపరచాలని మండల వ్యవసాయాధికారి తెలిపారు. రైతు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ పట్టాదారు పాస్ పుస్తకం (PPB) జిరాక్స్ కాపీ బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ కాపీ పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారం ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు ప్రక్రియ, ఇతర సందేహాల నివృత్తి కోసం రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారిని (AEO) సంప్రదించవచ్చు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను స్వీకరించే అవకాశం లేదని, తెలిపారు.

Next Story