- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ కమ్మర్ పల్లి: అనారోగ్య కారణాలతో మనస్తాపానికి గురై కమ్మర్ పల్లి మండలం గాంధీనగర్ కు చెందిన ముద్దంగుల అశోక్ (29) ఉరి వేసుకొని మృతి చెందినట్లు ఎస్ఐ సిహెచ్ సతీష్ శుక్రవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం కమ్మర్ పల్లి పరిధిలోని గాంధీనగర్ కు చెందిన ముద్దంగుల అశోక్ గత కొంతకాలంగా మూర్ఛ (ఫిట్స్) వ్యాధితో బాధపడుతున్నాడు. వివిధ ప్రాంతాల్లో వైద్యం చేయించినా నయం కాకపోవడంతో మానసిక వేదనకు గురై, మద్యానికి బానిసయ్యాడు. గత రెండు నెలలుగా ఏ పని చేయకుండా, రోజంతా మద్యం తాగుతూ అనారోగ్యం మరింత తీవ్రం కావడంతో జీవితంపై విరక్తి చెందాడు. శుక్రవారం ఉదయం ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. మృతుని భార్య సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story






