- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కళ్యాణదుర్గం అభివృద్ధికి ముందడుగు
by Vemula.Srinu Prasad |
కళ్యాణదుర్గంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ₹178.74 కోట్లతో ఇంటింటికి కుళాయి పథకానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు భూమిపూజ చేశారు....

X
దిశ, కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ₹178.74 కోట్లతో ఇంటింటికి కుళాయి పథకానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాగు, తాగునీటి ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం ప్రజావేదికలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 25 మంది బాధితులకు రూ.10.48 లక్షల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పేదలు అనారోగ్యంతో ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ప్రజల ఆరోగ్యం, మౌలిక వసతుల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Next Story






