- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లింగాలలో విషాదం.. మరో చిన్నారి మృతి
లింగాల మండలంలో వరుసగా చోటుచేసుకుంటున్న చిన్నారుల విషాద ఘటనలు ప్రజలను కలచివేస్తున్నాయి...

దిశ పులివెందుల: లింగాల మండలంలో వరుసగా చోటుచేసుకుంటున్న చిన్నారుల విషాద ఘటనలు ప్రజలను కలచివేస్తున్నాయి. గురువారం లోపట్నూతల గ్రామంలో నాలుగేళ్ల బాలిక మృతి ఘటన మరువక ముందే శుక్రవారం చిన్నకూడాల గ్రామంలో మరో చిన్నారి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు.
లింగాల మండలం చిన్నకూడాల గ్రామ హరిజనవాడ సమీపంలో ఉన్న లింగాల కుడి కాలువలో జారిపడి చిన్నకూడాల హరిజనవాడకు చెందిన అరుణ్ కుమార్, నాగమ్మ దంపతుల కుమారుడు అభయ్ (7) మృతి చెందాడు. గురువారం అభయ్ మరో చిన్నారితో కలిసి అంగడికి వెళ్లి తినుబండారాలు కొనుక్కొని తిరిగి ఇంటికి వస్తుండగా హరిజనవాడ సమీపంలోని కాలువ వద్ద ప్రమాదవశాత్తు జారి నీటి ప్రవాహంలో పడిపోయాడు. అభయ్‌తో పాటు వెళ్లిన చిన్నారికి మాట్లాడే సామర్థ్యం లేకపోవడంతో విషయం ఎవరికీ తెలియలేదు.
కుటుంబ సభ్యులు బాలుడి ఆచూకీ కోసం వెతుకుతున్న సమయంలో కాలువలో బాలుడి మృతదేహం కనిపించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.ఒకవైపు చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో.. మరో చిన్నారి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోవడం మండల ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాలువల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.






