- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైక్ ను ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి
by Taduka Kalyani |
మాడ్గుల మండలం సుద్ధపల్లి గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్య తీవ్రంగా గాయపడింది.

X
దిశ, మాడ్గుల: మాడ్గుల మండలం సుద్ధపల్లి గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్య తీవ్రంగా గాయపడింది. సీఐ వేణుగోపాల్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. కుబ్యా తండాకు చెందిన నేనావత్ సోమ్లా తన భార్య సాలితో కలిసి వింజమూర్ గ్రామంలో జరిగిన విందుకు హాజరై టీవీఎస్ మోటార్‌సైకిల్‌పై తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో సుద్ధపల్లి గ్రామ శివారులో ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోమ్లా అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన సాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
Next Story






