భారీ చోరీ కేసు ఛేదన: అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

by Vemula.Srinu Prasad |

వినుకొండ వేక్షితా జ్యుయెలర్స్‌లో గత నెల 21న జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేశారు...

భారీ చోరీ కేసు ఛేదన: అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
X

దిశ వినుకొండ: వినుకొండ వేక్షితా జ్యుయెలర్స్‌లో గత నెల 21న జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేశారు. సుమారు రూ.27 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలతో పాటు నగదు, ద్విచక్ర వాహనం, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు వెల్లడించారు. పట్టుబడిన దొంగపై రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 దొంగతనం కేసులు నమోదు అయినట్లు తెలిపారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఈ భారీ చోరీ కేసును ఛేదించడంలో విశేష ప్రతిభ చూపిన సీఐ ప్రభాకర్‌ను డీఎస్పీ హనుమంతరావు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే దొంగను పట్టుకోవడంలో సీఐకి సహకరించిన పోలీస్ సిబ్బంది లక్ష్మణ్, సునీల్, అశోక్, నాయక్, జయరామ్‌లకు డీఎస్పీ రివార్డులను అందజేసి వారి సేవలను కొనియాడారు.

Next Story