- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
నల్గొండ జిల్లా పర్యటనకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు.

దిశ, కనగల్ : నల్గొండ జిల్లా పర్యటనకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఆయన నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో జరుగుతున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను, అనంతరం కనగల్ మార్కెట్ యార్డు సమీపంలో ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న రూ.13,006 కోట్ల హ్యాం రోడ్ల ప్రాజెక్టు శంకుస్థాపన పైలాన్‌ను పరిశీలించారు.సభా వేదిక, టెంట్లు, జర్మన్ హ్యాంగర్లు, లైటింగ్, సౌండ్ సిస్టమ్, ఎల్ఈడీలు, బ్యారికేడింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించి, వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి జిల్లా చేరుకున్నప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రత, రాకపోకలు, ప్రజల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.అనంతరం కనగల్‌లో హ్యాం రోడ్ల పైలాన్, హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించి, సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని, అక్కడ కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్, అదనపు కలెక్టర్లు, ఆర్‌అండ్‌బి అధికారులు, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఎంపీడీవో వేద రక్షిత, తహసిల్దార్ పద్మ తదితరులు పాల్గొన్నారు.






