Technology : గూగుల్‌లో కొత్త AI ఫీచర్.. మీ గోప్యతకు ముప్పు!

by Javid Pasha |

సెర్చ్ సర్వీసెస్‌ హిస్టరీ ఆన్‌లో ఉండటంవల్ల మీ ప్రైవేట్ ఫొటోలు, వాయిస్ రికార్డింగులను గూగుల్ సేవ్ చేసుకునే అవకాశం ఉంది.

Technology : గూగుల్‌లో కొత్త AI ఫీచర్.. మీ గోప్యతకు ముప్పు!
X

దిశ, ఫీచర్స్ : మీకు ఈ విషయం తెలుసా? గూగుల్ తన సెర్చ్ సర్వీసెస్‌లో కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. మే 26, 2026 నుంచి ఇది రోల్ అవుట్ అవుతోంది. అయితే పలువురు వినియోగదారులు దీనివల్ల ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే.. ఇది గూగుల్ లెన్స్ ద్వారా అప్‌లోడ్ చేసిన ఫొటోలు, ఆడియోలు, వీడియోలు, లైవ్ సెర్చ్ రికార్డింగ్‌‌లు, ట్రాన్స్‌క్రిప్టులను సేవ్ చేసి, తన ఏఐ మోడల్స్‌కు ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపయోగించుకుంటుంది. ఈ సెట్టింగ్ ఆన్‌లో ఉంటే మీ సెర్చ్ హిస్టరీ, మ్యాప్స్, లొకేషన్స్, ఏఐ జనరేటెడ్ ఇన్ఫర్మేషన్ వంటివన్నీ గూగుల్‌ హిస్టరీలో సేవ్ అవుతాయి. దీంతో మీ వ్యక్తిగత డేటా కూడా లీక్ అయ్యే చాన్స్ ఉంటుంది. అందుకే ఎలక్ట్రానిక్ ప్రైవసీ ఇన్ఫర్మేషన్ సెంటర్ (EPIC) సీనియర్ కౌన్సెల్ Calli Schroeder వంటి గోప్యతా నిపుణులు ఈ ఫీచర్‌ను తక్షణం ఆఫ్ చేయాలని సూచిస్తున్నారు.

సెర్చ్ సర్వీసెస్‌ హిస్టరీ ఆప్షన్ ఆన్‌లో ఉండటంవల్ల మీ ప్రైవేట్ ఫొటోలు, వాయిస్ రికార్డింగులు వంటి బయోమెట్రిక్ డేటాను గూగుల్ సేవ్ చేసుకునే అవకాశం ఎక్కువ. ఇది వ్యక్తిగత ప్రకటనలు, ధరలు, డేటా దుర్వినియోగం వంటి ఇబ్బందులకు దారితీయవచ్చు. కాబట్టి దానిని ఆఫ్ చేయడం ద్వారా భద్రతా పరమైన సమస్యలు తలెత్తవని నిపుణులు సూచిస్తున్నారు. అలాగనీ అందరూ ఆఫ్ చేయాలనే రూల్ ఏమీ లేదు. తమ తమ వ్యక్తిగత ఆసక్తులను బట్టి ఆన్‌లో లేదా ఆఫ్‌లో ఉంచుకోవచ్చు. అయితే దానివల్ల కలిగే లాభ, నష్టాల గురించి అవగాహన కలిగి ఉండటం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

ఎలా ఆఫ్ చేయాలి?

సెర్చ్ సర్వీసెస్ హిస్టరీ(Search Services History)ని ఆఫ్ చేయడానికి ముందు మీ Google ఖాతాలో సైన్ ఇన్ చేయండి. తర్వాత myactivity.google.comకి వెళ్లి Search Services History సెట్టింగ్‌ను సెలెక్ట్ చేసుకొని ఆఫ్ చేయండి. అలాగే మీడియా సేవ్ ఆప్షన్‌ను కూడా అన్‌చెక్ చేయండి. ఒకవేళ ఈ ఫీచర్ మీ ఖాతాకు ఇంకా రాలేదనుకుంటే, Web & App Activityను ఆఫ్ చేసి ఉంచండి.

ఆఫ్ చేయడం వల్ల లాభాలు?

*సెర్చ్ సర్వీసెస్ హిస్టరీ ఆప్షన్‌ను ఆఫ్ చేయడంవల్ల గోప్యత పెరుగుతుంది. మీ ఫోటోలు (Google Lens), వాయిస్ రికార్డింగులు, లైవ్ సెర్చ్‌లు, ట్రాన్స్‌లేట్ ఆడియో వంటివి గూగుల్ సర్వర్లలో సేవ్ కావు. ఏఐ (AI) శిక్షణకు గూగుల్ ఉపయోగించుకోదు.

*వ్యక్తిగత డేటా దుర్వినియోగం కాకుండా ఉంటుంది. టార్గెటెడ్ యాడ్స్, డేటా లీక్ వంటి అవకాశాలు తగ్గుతాయి. అలాగే మీ ప్రైవేట్ సమాచారం (పిల్లల ఫోటోలు, పర్సనల్ ఇమేజెస్, సెన్సిటివ్ సెర్చ్‌‌లు) గూగుల్ వద్ద దీర్ఘకాలం నిల్వ ఉండదు.

ఆఫ్ చేయడం వల్ల నష్టాలు

*గూగుల్ అకౌంట్‌లో సెర్చ్ సర్వీసెస్ హిస్టరీ(Search Services History)ని ఆఫ్ చేయడంవల్ల పర్సనలైజ్డ్ ఫీచర్లు తగ్గుతాయి. గత సెర్చ్‌ల ఆధారంగా మంచి సూచనలు, రికమెండేషన్లు వంటివి తక్కువగా వస్తాయి. అంతేకాకుండా Google Assistant, Maps లొకేషన్ సజెషన్స్, మార్కెట్ లేదా షాపింగ్ సూచనలు మరింత తక్కువ ఖచ్చితంగా ఉండవచ్చు.

*ఏఐ ఫీచర్లు (Gemini వంటివి) మీ డేటా ఆధారంగా మెరుగుపడకపోవచ్చు. అలాగే కొన్ని సర్వీసుల్లో ‘మీ కోసం (for you)’ అని వచ్చే రికమెండేషన్లు తగ్గుతాయి. కాబట్టి ఫైనల్‌గా సెర్చ్ సర్వీసెస్ హిస్టరీని ఆఫ్ చేయాలా? ఆన్‌లో ఉంచాలా అనేది మీ వ్యక్తిగత ఆసక్తి, ప్రైవసీని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు.

Next Story