- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IRE vs IND : వైభవ్ అరంగేట్రం ఆలస్యం.. కారణాన్ని వివరించిన కెప్టెన్
by Harish |
ఐర్లాండ్‌తో తొలి టీ20లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడని అందరూ భావించారు.

X
దిశ, స్పోర్ట్స్ : ఐర్లాండ్‌తో తొలి టీ20లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడని అందరూ భావించారు. కానీ, తుది జట్టులో అతనికి చోటు దక్కలేదు. టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని బెంచ్‌కే పరిమితం చేసింది. ఓపెనర్లుగా సీనియర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లకే మొగ్గు చూపింది. టాస్ సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. వైభవ్ తీసుకోకపోవడానికి గల కారణాన్ని వివరించాడు. జట్టులో ఉన్న సీనియర్లు మంచి ఫామ్‌లో ఉండటంతో వైభవ్‌కు చాన్స్ ఇవ్వలేకపోయామన్నాడు. ‘దురదృష్టవశాత్తు అతనికి చోటు దక్కలేదు. వైభవ్ అద్భుతమైన ప్లేయర్. కానీ, మాకు అనుభవజ్ఞులతో కూడిన జట్టు ఉంది. సీనియర్లు భారత్ తరపున గత రెండు సిరీస్‌ల్లో రాణించారు. కాబట్టి, బాగా ఆడుతున్న వారికి మేము మద్దతు ఇస్తున్నాం. సమయం వచ్చినప్పుడు అతనికి చాన్స్ దక్కుతుంది.’అని శ్రేయస్ తెలిపాడు.
Next Story






