విష పూరిత వ్యర్థాలతో చేపల మృతి

by Taduka Kalyani |

దోమ మండల పరిధిలోని మోత్కూర్ లో విష పూరిత వ్యర్ధాలు చేరి చెరువులోని చేపలన్నీ చనిపోయిన ఘటన వెలుగు చూసింది

విష పూరిత వ్యర్థాలతో చేపల మృతి
X

దిశ, దోమ : దోమ మండల పరిధిలోని మోత్కూర్ లో విష పూరిత వ్యర్ధాలు చేరి చెరువులోని చేపలన్నీ చనిపోయిన ఘటన వెలుగు చూసింది. పడమటి కుంట చెరువును వేలంపాటలో పాడుకున్న సంపల్లి నరేష్ అనే మత్యకారుడు భారీగా నష్టపోయాడు. కురిసిన వర్షాలకు చెరువులోకి రసాయన వ్యర్థాలు కొట్టుకు రావడంతో చేపలన్నీ మృతి చెందాయి. 10 ఏళ్లుగా ఇదే వృత్తిలో జీవిస్తున్న తనకు రూ. 4 లక్షల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు.

Next Story