- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
by Kodari Anjali |
ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ , కాప్రా: ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... బిల్డర్‌గా పనిచేసే తెనాలి రమేష్ (46) చర్లపల్లి బి ఎన్ రెడ్డి కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఈనెల 22వ తేదీన రాత్రి 9.40 సమయంలో తెనాలి రమేష్ బయట పని ఉందని ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలు ప్రాంతాలలో వెతికిన ఆచూకీ లభించలేదు. ఇంటికి అతడే తిరిగి వస్తాడని వేచి చూసిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తెనాలి రమేష్ కుమారుడు తినాలి రామ నాగసాయి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






