- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలు నుండి జారిపడి వలస కూలీ మృతి
మధిర జిఆర్ పి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రుపాలెం–గంగినేని రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి ఓ వలస కూలీ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, ఎర్రుపాలెం : మధిర జిఆర్ పి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రుపాలెం–గంగినేని రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి ఓ వలస కూలీ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. మూడు నుంచి నాలుగు రోజుల క్రితం రాత్రి సమయంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి పడిపోయి మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతదేహం రైల్వే పట్టాల పక్కన ఉన్న కింద కంపలో పడిఉండగా, ఎండ తీవ్రత కారణంగా పూర్తిగా కుళ్లిపోయి పురుగులు పట్టిన స్థితిలో కనిపించింది. భీమెన్ ద్వారా సమాచారం అందడంతో శుక్రవారం మధిర రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని తరలించేందుకు ఖమ్మానికి చెందిన అన్నం ఫౌండేషన్ సేవలను కోరారు. సమాచారం అందుకున్న ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అంబులెన్స్‌తో సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని, అత్యంత దుర్వాసన, కుళ్లిన పరిస్థితుల్లో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని మూటకట్టి, కిలోమీటర్ల మేర రైల్వే పట్టాల నుంచి రోడ్డు వరకు మోసుకొచ్చి అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధార్ కార్డు, రెండు సెల్‌ఫోన్లు, రైల్వే టికెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు అనిల్ కుమార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని వద్ద చెన్నై వెళ్లేందుకు తీసుకున్న రైల్వే టికెట్ కూడా లభ్యమైనట్లు తెలిపారు. ఈ ఘటనపై మధిర జిఆర్ పి పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






