మొహరం వేడుకల్లో పాల్గొన్న హరీష్ రావు

by Taduka Kalyani |

మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి. హరీష్ రావు శుక్రవారం హైదరాబాద్‌లోని అజాంపురాలో మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ నివాసానికి మర్యాదపూర్వకంగా వెళ్లి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

మొహరం వేడుకల్లో పాల్గొన్న హరీష్ రావు
X

దిశ, చంపాపేట్ : మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి. హరీష్ రావు శుక్రవారం హైదరాబాద్‌లోని అజాంపురాలో మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ నివాసానికి మర్యాదపూర్వకంగా వెళ్లి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు హరీష్ రావును కలిసి మొహరం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన దబీర్‌పురాలోని బీబీ కా అలం వద్ద మొహరం వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం దట్టీలు సమర్పించి రాష్ట్రంలో శాంతి, సామరస్యం నెలకొనాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం గంగా-జమునా తెహజీబ్‌కు ప్రతీకగా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవం, సోదరభావంతో కలిసి జీవించే సంస్కృతి చిరకాలం కొనసాగాలని, రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అజాం అలీ, కోరుడు భూమేశ్వర్, ముస్తా ఖాన్, అలీ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి, అజిత్ రెడ్డి, నర్సింగ్, మహేష్, రాధా, వంజరి ప్రవీణ్, గణేష్, మల్లేష్, శ్రీను తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story