- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతర్జాతీయ కరాటే పోటీల్లో ప్రతిభ చూపిన కిడ్స్‌ను అభినందించిన మంత్రి
కరాటే కిడ్స్ ను మంత్రి అడ్లూరి అభినందించారు.

దిశ, ధర్మపురి: అంతర్జాతీయ కరాటే పోటీల్లో ప్రతిభ కనబర్చిన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల విద్యార్థులను రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభినం దించారు. మే 29నుండి 31వరకు నేపాల్ దేశం కాట్మాండ్ లో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్స్ షిప్ పోటీల్లో పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రూషగాని వినూత్న అండర్ 9-10 బాలికల స్పారింగ్ విభాగంలో ప్రథమ స్థానం సాధించగా అండర్ 14-15 బాలికల స్పారింగ్ విభాగంలో వి నిహారిక ప్రథమ స్థానం పొందగ దాసరి ధనస్విని 9-10 విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. ఓదెల గ్రామానికి చెందిన లగిశెట్టి శరణ్య 16-17 బాలికల స్పారింగ్ విభాగంలో తృతీయ స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించగా అండర్ 17-18 బాలికల స్పారింగ్ విభాగంలో ఎంబడి చందన తృతీయ స్థానం లో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించారు. కరాటే మాస్టర్ కాలువల రమేష్ ఆధ్వర్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలువగా వీరిని మంత్రి లక్ష్మణ్ కుమార్ అభినందించారు.






