నూతన తాహసీల్దార్ భవన నిర్మాణానికి రూ. 2 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి జూపల్లి

by Kodari Anjali |

నూతన తాహసీల్దార్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మంత్రి జూపల్లి నిధులు మంజూరు చేసిన మంత్రి జూపల్లికి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

నూతన తాహసీల్దార్ భవన నిర్మాణానికి రూ. 2 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి జూపల్లి
X

దిశ, వీపనగండ్ల: మండల కేంద్రంలో తాహసీల్దార్ కార్యాలయ భవనం నిర్మాణం, మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో నూతన అంగన్‌వాడీ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు నాగర్‌కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ తెలిపారు. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో ఈ నిధులు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించే తహసీల్దార్ భవన నిర్మాణానికి రెండు కోట్ల 25 లక్షల రూపాయలు మంజూరు కాగా, కల్వరాల, పుల్గర్‌చర్ల, వీపనగండ్ల, రంగవరం, వల్లభాపురం తాండా, గోవర్ధనగిరి, బొల్లారం గ్రామాల్లో ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి రూ.12 లక్షల చొప్పున నూతన భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. నిధుల మంజూరుకు కృషిచేసిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు నాగర్ కర్నూలు జిల్లా పర్యాటకశాఖ అధికారి కల్వరాల నరసింహ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story