- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అతిమనోహరం’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన మోహన్ లాల్
ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24, 2026న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు

దిశ, సినిమా: మలయాళ స్టార్ మోహన్ లాల్ ఈ వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ఇటీవల దృశ్యం-3, తుడరుమ్ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘అతిమనోహరం’. ఈ సినిమాలో మోహన్‌లాల్ ‘లవ్‌లాజన్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, ఆయన భార్య ‘నైసి’ పాత్రలో సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ నటిస్తున్నారు. ‘తుడరుమ్’ లాంటి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ తీసిన డైరెక్టర్ తరుణ్ మూర్తి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ఆశిక్ ఉస్మాన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
‘ఇష్క్’ ఫేమ్ రతీష్ రవి ఈ చిత్రానికి కథ అందిస్తుండగా.. ‘తుడరుమ్’ సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీమే ఈ ప్రాజెక్ట్‌కు కూడా పనిచేస్తుండటం విశేషం. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. తాజాగా, మోహన్ లాల్ సోషల్ మీడియా ద్వారా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24, 2026న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేయడంతో పాటు ఆసక్తికర క్యాప్షన్ జత చేశారు. ‘‘ఆయన ప్రపంచం తన కుటుంబంతోనే మొదలై, వారితోనే ముగుస్తుంది’’ అని రాసుకొచ్చారు. దీనిని బట్టి ఇదొక ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న పోలీస్ స్టోరీ అని అర్థమవుతోంది. చాలా ఏళ్ల తర్వాత మీరా జాస్మిన్, మోహన్‌లాల్ పక్కన ఫుల్ లెంగ్త్ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది.






