ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాలకు అలర్ట్

by Ajay Maddhiboyina |

ఏపీలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. రాబోయే 24 గంట‌ల్లో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, బాప‌ట్ల‌, ప‌ల్నాడు, ప్ర‌కాశం జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది.

ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాలకు అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. రాబోయే 24 గంట‌ల్లో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, బాప‌ట్ల‌, ప‌ల్నాడు, ప్ర‌కాశం జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. కోస్తాంధ్ర నుండి తెలంగాణ మీదుగా మ‌ధ్య మ‌హారాష్ట్ర వ‌ర‌కు ఉప‌రిత‌ల ద్రోణి విస్త‌రించిన‌ట్టు పేర్కొంది. ఈశాన్య‌-తూర్పు మ‌ధ్య బంగాళ‌ఖాతం మీదుగా ఆవ‌ర్త‌నం ఏర్ప‌డింద‌ని, కోస్తా అంత‌టా 50 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంద‌ని తెలిపింది. శ‌నివారం సైతం రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురిసే ఛాన్స్ ఉంద‌ని తెలిపింది. శ‌నివారం కోస్తా, రాయ‌ల‌సీమ‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా గంట‌కు 40 నుండి 50 కిలోమీట‌ర్ల వేగంతో బ‌ల‌మైన గాలులు వీస్తాయ‌ని పేర్కొంది. మ‌రోవైపు వ‌ర్షం స‌మ‌యంలో బ‌య‌ట తిరిగేవాళ్లు సుర‌క్షిత‌మైన ప్ర‌దేశాల్లో ఉండ‌టం మంచిద‌ని డిజాస్ట‌ర్ మేజేన్మెంట్ అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు పాత‌బ‌డిన చెట్ల కింద నిల‌బ‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డాల‌ని చెబుతున్నారు.

Next Story