త్యాగాలకు ప్రతీక మొహర్రం: మంత్రి అడ్లూరి

by Kodari Anjali |

ధర్మపురిలో మొహర్రం వేడుకల్లో మంత్రి అడ్లూరి పాల్గొన్నారు.

త్యాగాలకు ప్రతీక మొహర్రం: మంత్రి అడ్లూరి
X

దిశ, ధర్మపురి: ధర్మపరి పట్టణంలో శుక్రవారం మొహర్రం వేడుకలను హిందూ ముస్లింలు కలిసి ఘనంగా జరుపుకున్నారు. మెహర్రం వేడుకల్లో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని నంది చౌరస్తాలో పీరీలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. త్యాగాలకు చిహ్నంగా బావించే మొహార్రంను తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా హిందూ, ముస్లీంలు సోదరభావంతో కలిసి పీర్ల పండుగ పేరుతో జరుపుకుంటారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో భవిష్యత్తు తరాల కోసం హిందూ ముస్లిం భాయి భాయి సంస్కృతిని కొనసాగించాలని మంత్రి కోరారు.

Next Story