- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలు చేస్తున్న నేరాలపై సినిమా తీయమన్న నెటిజన్.. రాహుల్ రవీంద్రన్ షాకింగ్ రియాక్షన్!
సమాజంలో మగవారిపై ఆడవారు చేసే అఘాయిత్యాలు నాకైతే ఎక్కడా కనిపించడం లేదు.

దిశ, సినిమా: టాలీవుడ్ దర్శకుడికి ఓ వింత అనుభవం ఎదురైంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పురుషులపై మహిళలు చేస్తున్న నేరాల కాన్సెప్ట్‌తో ఓ సినిమా తీయమని నెటిజన్ రాహుల్‌ను ట్యాగ్ చేసి మరీ పోస్ట్ పెట్టారు. తాజాగా, ఈ విషయంపై రాహుల్ ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అవుతూ.. "నాకు అన్నీ తెలుసని నేను అస్సలు అనుకోను బ్రదర్.. ఒకవేళ నేను చెప్పేది తప్పైతే నాకు వివరించండి. కానీ, సమాజంలో మగవారిపై ఆడవారు చేసే అఘాయిత్యాలు నాకైతే ఎక్కడా కనిపించడం లేదు. మానసిక సమస్యలు లేదా సమాజ వ్యతిరేక ప్రవర్తన ఉన్న కొందరు ఆడవాళ్లు చేసే ఘోరమైన నేరాలను నేను చూస్తున్నాను. కానీ, మరోవైపు శతాబ్దాలుగా ఆడవారిని ఊపిరాడకుండా చేస్తున్న ఒక వ్యవస్థను నేను గమనిస్తున్నాను. కంటికి కనిపించని, రోజువారీ చిన్న చిన్న దాడుల ద్వారా మహిళలు తమ గుర్తింపును కోల్పోయేలా ఆ వ్యవస్థ బలవంతం చేస్తోంది. అది వారికి సమానమైన ప్రపంచాన్ని ఇవ్వడం లేదు. నా చుట్టూ ఉన్న ఎంతో మంది మహిళలు దీనివల్ల నిశ్శబ్దంగా బాధపడటం చూశాను. అందుకే నా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ కథ ద్వారా ఆ విషయాన్నే చెప్పాలనుకున్నాను. ఒక మగవాడిగా సమాజంలో ఉన్న ఈ అధికార సమీకరణాల వల్ల నేను లాభపడుతున్నాను కాబట్టి, దీనికి నేనే బాధ్యత వహించాలని అనుకున్నాను" అని చెప్పారు.
నెటిజన్ చెప్పిన నేర సంఘటన గురించి మాట్లాడుతూ.. "నేను ఇంకా ఆ కేసు వివరాలు పూర్తిగా చదవలేదు, తప్పకుండా చదువుతాను. ఒకవేళ అందులో ఏదైనా ఆసక్తికరమైన పాయింట్ ఉంటే సినిమా కూడా తీస్తాను. కానీ అది ఒక పర్టికులర్ మహిళ చేసిన నేరం గురించి మాత్రమే ఉంటుంది కానీ, మగవారిపై ఆడవాళ్లు చేసే నేరాల కేటగిరీ కిందకు రాదు. నా దృష్టిలో ఆ రెండింటికీ చాలా తేడా ఉంది. ఇలాంటి నేరాలు చాలా ఘోరమైనవి, దారుణమైనవి. కానీ నేను నా సినిమాలో చూపించాలనుకున్న పాయింట్ వేరు, దానికి ఇలాంటి నేరాలతో ఎలాంటి సంబంధం లేదు" అని క్లారిటీ ఇచ్చారు. చివరగా తన సినిమా గురించి చెప్తూ.. "‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలో విక్రమ్ పాత్ర హంతకుడు లేదా నీచుడు కాదు. అందులో ఎలాంటి శారీరక హింస ఉండదు. నిజానికి అతను నమ్మకమైనవాడే. అయినప్పటికీ, కొందరు ఈ సినిమా చూసి ఎందుకు హర్ట్ అవుతున్నారో వాళ్లే ప్రశ్నించుకోవాలి. ఏదేమైనా మీకు ఎలాంటి సమస్య ఉన్నా దాన్ని ఎత్తి చూపడం మంచి అలవాటు. నేను ఆ ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుని కచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకుంటాను. మనమందరం ఒకరితో ఒకరు మాట్లాడుకుని, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా మంచి విషయం" అని రాసుకొచ్చారు.






