- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎంవోలో భారీ ప్రక్షాళన.. అజిత్ రెడ్డి అవుట్, మరో కీలక అధికారి ఇన్
by Gantepaka Srikanth |
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO)లో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. పాలనా యంత్రాంగాన్ని మరింత వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం సీఎంవోలో భారీ ప్రక్షాళన చేపట్టింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO)లో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. పాలనా యంత్రాంగాన్ని మరింత వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం సీఎంవోలో భారీ ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగా కొంతకాలంగా సీఎంవోలో కీలక బాధ్యతల్లో ఉన్న అజిత్ రెడ్డిని ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. అదే సమయంలో, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్. శ్రీధర్‌కు ముఖ్యమంత్రి కార్యాలయంలో చోటు కల్పించారు. సమర్థుడైన అధికారిగా పేరున్న శ్రీధర్ రాకతో సీఎంవోలో పాలనాపరమైన నిర్ణయాలు మరింత వేగవంతం కానున్నట్లు సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి. సీఎంవోను మరింత పటిష్టం చేసే వ్యూహంలో భాగంగానే ఈ మార్పులు జరిగినేట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.
Next Story






