- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరా పార్కులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసిన కాసేపటికే పగుళ్లు!
మొక్కుబడి పనులు.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపానికి ఇందిరా పార్క్ ఓపెన్ జిమ్ ఘటనే నిదర్శనంగా నిలిచింది.

దిశ, రాంనగర్ : మొక్కుబడి పనులు.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపానికి ఇందిరా పార్క్ ఓపెన్ జిమ్ ఘటనే నిదర్శనంగా నిలిచింది. ముషీరాబాద్‌లోని కావడిగూడ ఇందిరా పార్కులో శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఓపెన్ జిమ్.. నాణ్యత లోపాలతో మొదటి రోజే వివాదాల్లో చిక్కుకుంది.
ఓపెన్ జిమ్ కు వచ్చే వారి ప్రాణాలతో చెలగాటమా?
కేంద్ర మంత్రి వచ్చి రిబ్బన్ కట్ చేసి వెళ్లారో లేదో.. అప్పుడే జిమ్ పరికరాలలో తమ అసలు రంగు బయటపెట్టాయి. వ్యాయామం చేసే ఒక ప్రధాన పరికరం ఇనుప పైపు జాయింట్ వద్ద నిలువుగా పెద్ద చీలిక వచ్చింది.
కంటితుడుపు వెల్డింగ్:-పరికరాల తయారీలో ఎంత నాసిరకం మెటీరియల్ వాడారో ఆ పగులు చూస్తే అర్థమవుతోంది.
పూలదండల వెనుక నాణ్యత లోపం: ప్రారంభోత్సవం కోసం పూలమాలలతో అలంకరించిన ఆ హడావిడి వెనుక, కనీస బరువును కూడా తట్టుకోలేని నాసిరకం ఇనుప పరికరాలను అమర్చడంపై పలువురు సందర్శకులు మండిపడుతున్నారు.
తప్పిన ప్రమాదం: ఎవరైనా భారీ కాయం ఉన్నవారు దీనిపై వ్యాయామం చేస్తుండగా ఇది పూర్తిగా విరిగిపోతే పరిస్థితి ఏంటని, ప్రాణాల మీదకు తెచ్చే ఇలాంటి పరికరాలకు పర్మిషన్ ఎలా ఇస్తారని జీహెచ్ఎంసీ అధికారులను స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి!
ప్రజాధనాన్ని మంచి పనుల కోసం కాకుండా, ఇలాంటి నాసిరకం మెటీరియల్స్ కొనుగోలు చేస్తూ వృథా చేస్తున్నారని మార్నింగ్ వాకర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, ఇందిరా పార్కులోని మిగతా జిమ్ పరికరాల నాణ్యతను కూడా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.






