రఘురామకృష్ణంరాజు స్థలం కబ్జా.. పోలీసులకు ఫిర్యాదు

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు చెందిన స్థలం కొందరు కబ్జా చేశారు. విశాఖ జిల్లా మధురవాడలో రూ. 2 కోట్ల విలువైన 333 గజాల స్థలం రాఘురామరాజుకు ఉంది...

రఘురామకృష్ణంరాజు స్థలం కబ్జా.. పోలీసులకు ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు(Detuty Speaker RajuRamaKrishnam Raju)కు చెందిన స్థలం కొందరు కబ్జా చేశారు. విశాఖ జిల్లా మధురవాడ(Madhurawada)లో రూ. 2 కోట్ల విలువైన 333 గజాల స్థలం రాఘురామరాజుకు ఉంది. ఈ స్థలాన్ని ఆయన 1989లో కొనుగోలు చేశారు. అయితే పోర్జరీ సంతకంతో కొందరు వ్యక్తులు యాజమాన్య హక్కులను బదిలీ చేసుకున్నారు. ఒకరి నుంచి మరొకరు పలుమార్లు రిజిస్ట్రేషన్లు చేయించున్నారు. దీంతో ఆయన పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విశాఖలో స్థలాల ధరలకు రెక్కలు రావడంతో...

కాగా విశాఖ ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందడంతో అక్కడ స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కొన్ని ఏరియాల్లో వేలల్లో నుంచి లక్షల్లో చదరపు గజం పలుకుతోంది. దీంతో కబ్జాదారులు కూడా పెరిగిపోయారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాలు చేస్తున్నారు. గతంలోనూ పలు కబ్జా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్థలం కూడా కబ్జాకు గురైంది. దీంతో విశాఖలో కబ్జాల పర్వం మరోసారి తెరపైకి వచ్చింది.

Next Story