- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాగి గ్రామంలో ప్రభుత్వ పథకాలపై కళాజాత
నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో జిల్లా కలెక్టర్, డీపీఆర్వో ఆదేశాల మేరకు శుక్రవారం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక బాధ్యతలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కళాజాత కార్యక్రమం నిర్వహించారు.

దిశ : నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో జిల్లా కలెక్టర్, డీపీఆర్వో ఆదేశాల మేరకు శుక్రవారం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక బాధ్యతలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కళాజాత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రత్యేక సంక్షిప్త ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో అధికారులు చేపడుతున్న ప్రక్రియకు ప్రజలు సహకరించాలని, తమ వివరాలను సరిచూసుకుని అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని సందేశం అందించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగ నిషేధం, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం తదితర అంశాలపై పాటలు, నృత్యాలు, నాటికల ద్వారా ప్రజలకు చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు విశేషంగా హాజరై కళాజాత ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు సామాజిక బాధ్యతలను ప్రతి ఒక్కరూ నిర్వర్తించాలని కళాకారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రపు సుమిత్ర శ్రీనివాస్, ఉప సర్పంచ్ మేంగారం కవిత పండరి,నాయకులు గుర్రపు శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు గుర్రపు వెంకటేశం, కమ్మరి కత్త సాయిలు, మామిళ్ళ సాయిలు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు మహేందర్, రమేష్ రావు, రాము, నాగరాజు, రాము, సవిత, శిల్ప, దివ్య, లత, తిరుపతి, లక్ష్మీనారాయణ, పోశెట్టి, నరేష్ పాల్గొని తమ కళాప్రదర్శనలతో ప్రజలను ఆకట్టుకున్నారు. అధికారులు, గ్రామస్థులు కార్యక్రమాన్ని అభినందించారు.






