- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జుక్కల్ చౌరస్తా మీదుగా 160 చక్రాల భారీ వాహనం ఆసక్తిగా వీక్షించిన ప్రజలు
జుక్కల్ చౌరస్తా మీదుగా 161వ జాతీయ రహదారిపై గురువారం 160 చక్రాలతో కూడిన భారీ ప్రత్యేక రవాణా వాహనం ప్రయాణిస్తూ స్థానికులను ఆకట్టుకుంది.

దిశ, జుక్కల్ (నిజాంసాగర్) : జుక్కల్ చౌరస్తా మీదుగా 161వ జాతీయ రహదారిపై గురువారం 160 చక్రాలతో కూడిన భారీ ప్రత్యేక రవాణా వాహనం ప్రయాణిస్తూ స్థానికులను ఆకట్టుకుంది. హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు భారీ విద్యుత్ ఉత్పత్తి యంత్రాన్ని (పవర్ ప్లాంట్ పరికరాన్ని) తరలిస్తున్న ఈ వాహనం నెమ్మదిగా ముందుకు సాగింది. భారీ పరిమాణంలో ఉన్న యంత్రాన్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రత్యేకంగా రూపొందించిన మల్టీ-యాక్సిల్ ట్రైలర్‌ను వినియోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వాహనం వెళ్లే సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు, సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వాహనాన్ని చూసేందుకు స్థానికులు, ప్రయాణికులు పెద్ద సంఖ్యలో రహదారి వెంట చేరి ఆసక్తిగా తిలకించారు. కొందరు తమ మొబైల్ ఫోన్లలో చిత్రాలు, వీడియోలు కూడా చిత్రీకరించారు. ఈ భారీ వాహనం హైదరాబాద్ నుంచి గుజరాత్‌లోని గమ్యస్థానానికి చేరుకోవడానికి సుమారు మరో రెండు నెలల సమయం పడుతుందని వాహన డ్రైవర్ వెల్లడించాడు. భారీ లోడుతో ప్రయాణిస్తున్నందున రోజుకు పరిమిత దూరమే ప్రయాణించాల్సి వస్తోందని, రహదారి పరిస్థితులు, వంతెనలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని అత్యంత జాగ్రత్తగా ప్రయాణం కొనసాగిస్తున్నట్లు తెలిపాడు.






