ఓయూ లా అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల

by Taduka Kalyani |

తెలంగాణ లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్, పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు.

ఓయూ లా అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల
X

దిశ, సికింద్రాబాద్: తెలంగాణ లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్, పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం ఎల్‌ఎల్‌బీ కోర్సులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు జులై 5 నుంచి 10 వరకు నిర్వహించనున్నారు. సీట్ల కేటాయింపు జులై 24న జరగనుంది. ఎల్‌ఎల్‌ఎం కోర్సులకు రిజిస్ట్రేషన్లు జులై 27 నుంచి 31 వరకు స్వీకరించనుండగా, సీట్ల కేటాయింపు ఆగస్టు 5న చేపట్టనున్నారు. అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు, షెడ్యూల్ మరియు మార్గదర్శకాలను అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలని అధికారులు అభ్యర్థులకు సూచించారు.

Next Story