కుక్కల దాడిలో 30 గొర్రెల మృతి

by Ratna Kumari |

మండలంలోని అనంతారం గ్రామంలో కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది

కుక్కల దాడిలో 30 గొర్రెల మృతి
X

దిశ,గుండాల : మండలంలోని అనంతారం గ్రామంలో కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే అనంతారం గ్రామానికి చెందిన ఇట్టబోయిన యాదగిరికి చెందిన గొర్రెల మందపై విది కుక్కలు దాడి చేశాయి.30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 3 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ ఘటనతో సుమారు రూ.3 లక్షలు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరాడు.బాధితుడికి రూ.30 వేలు ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య సహకారంతో కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి,ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్, ఇమ్మడి దశరథ, ఏలూరి రాంరెడ్డి, నూనెముంతల వెంకటేశ్వర్లు, కొలుకొండ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Next Story