- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సికింద్రాబాద్ ఓటర్లకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు
ఓటర్లకు మెరుగైన సేవలు అందించడం కోసం సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ -70 పరిధిలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల నమోదు అధికారి తెలిపారు.

దిశ, సికింద్రాబాద్: ప్రత్యేక సత్వర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్–2026) కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, ఓటర్లకు మెరుగైన సేవలు అందించడం కోసం సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ -70 పరిధిలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్‌ఓ), మెట్టుగూడ డిప్యూటీ కమిషనర్ ఎం.ఎన్.ఆర్. జ్యోతి తెలిపారు. మెట్టుగూడలోని ఎన్నికల నమోదు అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సహాయ కేంద్రం ద్వారా ఓటరు నమోదు, పేరు, చిరునామా, ఇతర వివరాల సవరణ, పేరు తొలగింపు, ఫిర్యాదుల స్వీకరణ, సందేహాల నివృత్తి తదితర ఎన్నికల సేవలపై ప్రజలకు మార్గదర్శకత్వం అందించనున్నట్లు పేర్కొన్నారు. హెల్ప్‌డెస్క్ ఇన్‌చార్జ్‌గా వినయ్ వ్యవహరిస్తారని, ప్రజలు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హెల్ప్‌డెస్క్‌ను ప్రత్యక్షంగా సందర్శించవచ్చని లేదా 9063816962 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. అలాగే 70-సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నియమించిన అసిస్టెంట్ ఎన్నికల నమోదు అధికారులు, సూపర్‌వైజర్ల వివరాలను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రజలు తమ పోలింగ్ స్టేషన్‌కు సంబంధించిన అధికారులను నేరుగా సంప్రదించి అవసరమైన సేవలు పొందవచ్చని సూచించారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు ఈ సహాయ కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకుని ప్రత్యేక సత్వర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, ఓటరు జాబితాను ఖచ్చితమైనదిగా, సంపూర్ణమైనదిగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని జ్యోతి విజ్ఞప్తి చేశారు.






