తిరుమలలో నిజాయితీ చాటుకున్న హోటల్ క్యాషియర్

by Vemula.Srinu Prasad |

పెళ్లి నగలు మరచిపోయిన జంటకు హోటల్ క్యాషియర్ నిజాయితీ ఊరటనిచ్చింది. ఈ ఘటన తిరుమలలో జరిగింది. తిరుమలలో శ్రీవారి సాక్షిగా బెంగళూరుకు చెందిన ఓ నూతన జంట పెళ్లిచేసుకుంది. అనంతరం తిరుపతిలోని హోటల్‌‌‌లో అంతా భోజనం చేశారు....

తిరుమలలో నిజాయితీ చాటుకున్న హోటల్ క్యాషియర్
X

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి నగలు మరచిపోయిన జంటకు హోటల్ క్యాషియర్ నిజాయితీ ఊరటనిచ్చింది. ఈ ఘటన తిరుమలలో జరిగింది. తిరుమలలో శ్రీవారి సాక్షిగా బెంగళూరుకు చెందిన ఓ నూతన జంట పెళ్లిచేసుకుంది. అనంతరం తిరుపతిలోని హోటల్‌‌‌లో అంతా భోజనం చేశారు. ఆ తర్వాత బెంగళురుకు బయల్దేరి వెళ్లారు. కొద్దిదూరం వెళ్లగానే తమ వెంట తెచ్చుకున్న 300 గ్రాముల బంగారు నగలున్న బ్యాగ్‌ను మర్చిపోయినట్లు గుర్తించారు. వెంటనే కరుగుగా తిరిగొచ్చి ఆరా తీశారు.

నిజాయితీ చాటుకున్న హోటల్ క్యాషియర్ శశి

అయితే ఆ బ్యాగ్‌ను హోటల్ క్యాషియర్ శశి గమనించారు. వెంటనే హోటల్ యాజమాన్యానికి, అలాగే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోయిన సొత్తు కోసం కంగారుగా తిరిగి వచ్చిన బాధితులకు స్థానిక పోలీస్ అధికారుల సమక్షంలో అందజేశారు. పోగొట్టుకున్న నగలు తిరిగి దక్కడంతో నూతన దంపతులు, వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. హోటల్ క్యాషియర్ శశికి, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. నిజాయితీని చాటుకున్న శశిని అటు పోలీసులు, ఇటు స్థానికులు మెచ్చుకున్నారు.

Next Story