- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ స్టేషన్లో రాసలీలల వీడియో వైరల్.. మహిళా కానిస్టేబుల్ సస్పెండ్
ఉత్తరప్రదేశ్ లోని జాలౌన్ జిల్లా, ఒరై కొత్వాలి పోలీస్ స్టేషన్లో జరిగిన పోలీసుల రాసలీలల వీడియో బయటికి రావడంతో, అధికారులు కఠిన చర్యలకు దిగారు.

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ లోని జాలౌన్ జిల్లా, ఒరై కొత్వాలి పోలీస్ స్టేషన్లో జరిగిన పోలీసుల రాసలీలల వీడియో బయటికి రావడంతో, అధికారులు కఠిన చర్యలకు దిగారు. మహిళా కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయగా.., క్లర్కుకు మెమోలు జారీ చేసారు. పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూమ్‌లో నైట్ డ్యూటీలో భాగంగా కంప్యూటర్ ముందు కూర్చుని విధులు నిర్వహిస్తున్న ఒక పోలీస్ క్లర్క్ (కానిస్టేబుల్ అరవింద్ పటేల్) వద్దకు, అక్కడే శిక్షణలో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ వచ్చింది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్నామనే విషయాన్ని పట్టించుకోకుండా, పోలీసు యూనిఫాంలోనే వారిద్దరూ అత్యంత అసభ్యంగా ప్రవర్తించారు. కంట్రోల్ రూమ్‌లోని సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
నెటిజన్ల ఆగ్రహం
ఈ వీడియో వైరల్ అయిన కొద్ది గంటల్లోనే నెటిజన్లు, ప్రజల నుండి తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు శాఖలో ఉంటూ, అదీ పవిత్రమైన యూనిఫాం ధరించి కంట్రోల్ రూమ్ వంటి బాధ్యతాయుతమైన ప్రదేశంలో ఇలా ప్రవర్తించడం తీవ్ర సిగ్గుచేటని నెటిజన్లు మండిపడ్డారు. ఈ ఘటన పోలీసు శాఖ మొత్తం గౌరవానికి, ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించిందని, విధుల్లో ఇటువంటి నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యం ఏమాత్రం సహించరానివని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి.
చర్యలకు దిగిన అధికారులు
ఈ వ్యవహారం ముదురుతుండటంతో జాలౌన్ జిల్లా ఎస్పీ (SP) స్వయంగా రంగంలోకి దిగి తక్షణ చర్యలు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన అనంతరం, క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు గాను సదరు మహిళా కానిస్టేబుల్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, క్లర్కుకు మెమోలు పంపించారు. ఈ మొత్తం ఘటనపై సమగ్ర అంతర్గత విచారణకు (Departmental Enquiry) ఆదేశించారు. మరోవైపు వీడియోలో ఉన్న పోలీస్ క్లర్క్‌పై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తుండటంతో, విచారణ నివేదిక ఆధారంగా తదుపరి కఠిన చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.






