రాష్ట్రంలో ఐఏఎస్‌ల బదిలీ.. సీఎం ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్

by Naga Rani Yarlagadda |

తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో ఐఏఎస్‌ల బదిలీ.. సీఎం ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంఓ నుంచి అజిత్ రెడ్డికి ఉద్వాసన పలికి ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్. శ్రీధర్ నియమితులయ్యారు. సబ్యసాచి ఘోష్ కు అదనంగా టెక్స్ టైల్స్ శాఖ బాధ్యతలు అప్పగించింది. అటవీశాఖ ప్రధాన కార్యదర్శిగా శైలజా రామయ్యర్, జీఏడీ ప్రధాన కార్యదర్శిగా అహ్మద్ నదీమ్, విపత్తు నిర్వహణశాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించింది.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా టి. వెంకన్న, ఆర్అండ్ బీ ప్రత్యేక కార్యదర్శిగా కె. గంగాధర్, పర్యాటకశాఖ డైరెక్టర్ గా విద్యాసాగర్, రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీగా పి. కాత్యాయనీ దేవి, జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా కె. చంద్రకళ, TGREDCO వైస్ చైర్మన్ అండ్ ఎండీగా ఎం.డి.ముష్రఫ్ అలీ ఫరూక్, ప్రభుత్వ మైన్స్ అండ్ జియాలజీశాఖ కార్యదర్శిగా ఎం.రఘునందన్ రావులను నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story