భర్త అనుమాన భూతానికి.. ఐదు నెలల గర్భిణి బలి

by Taduka Kalyani |   (  Updated:2026-06-26 09:04:12  IST  )

భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గడి పెద్దాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

భర్త అనుమాన భూతానికి.. ఐదు నెలల గర్భిణి బలి
X

దిశ, అల్లాదుర్గం : భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గడి పెద్దాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ శంకర్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన గాజుల అభిలాష్ తన భార్య సుస్మిత (23) పై తరచూ అనుమానంతో మానసికంగా, శారీరకంగా హింసించి వేధించాడని తెలిపారు. ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి గా ఉన్న డిఎన్ఏ పరీక్ష నిర్వహించాలని మొండికేసినట్లు పేర్కొన్నారు. గురువారం రాత్రి సుస్మిత ఇంట్లో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురి మృతికి భర్త అభిలాష్,అత్త శశిరేఖ లే కారణమని మృతుడి తల్లి జనాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు.

Next Story