యూరియా యాప్‌లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మిస్.. బుకింగ్‌లు కాక రైతుల అవస్థలు!

by Kema Shiva Kumar |

యూరియా యాప్‌లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మిస్.. బుకింగ్‌లు కాక రైతుల అవస్థలు!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వ అధికారిక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ (Urea Booking App)లో సాంకేతిక లోపం తలెత్తింది. వానాకాలం సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో ఈ యాప్‌లోని జిల్లాల జాబితా నుంచి రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలు పూర్తిగా కనిపించకుండాపోయాయి. దీంతో ఆయా జిల్లాల పరిధిలోని వేలాది మంది రైతులు యూరియాను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోలేక అష్టకష్టాలు పడుతున్నారు. పంటలకు యూరియా వేయాల్సిన కీలకమైన సమయంలో యాప్‌లో సాంకేతిక సమస్య తలెత్తడం, డీలర్లు యాప్ బుకింగ్ ఉంటేనే స్టాక్ ఇస్తామని తెగేసి చెప్పడంతో అన్నదాతలు సొసైటీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వ్యవసాయ శాఖ అధికారులు, ఐటీ విభాగం తక్షణమే స్పందించి యాప్‌లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను యాడ్ చేస్తూ ఆప్షన్లను పునరుద్ధరించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story