కార్తే ప్రారంభమైన కానరాని ఆరుద్ర పురుగులు

by Kodari Anjali |

కార్తే ప్రారంభమైనందున రైతులంతా ఆరుత్ర పురుగులు ఎప్పుడెప్పుడు దర్శనమిస్తాయని ఎదురుచూస్తున్నారు.

కార్తే ప్రారంభమైన కానరాని ఆరుద్ర పురుగులు
X

దిశ, సైదాపూర్: ఆరుద్ర కార్తేలో కనిపించే ఆరుద్ర పురుగులు ప్రస్తుతం కార్తే ప్రారంభమైన కనిపించకపోవడంతో రైతులు వాటికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆరుద్ర అను కార్తే నక్షత్రాలలో ఆరోది. హిందువుల రాశి చక్రంలో ఆరుద్ర తార యొక్క నాలుగు పాదములున్న మిధునము అన్న రాశికి చెందినది. వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకుగాను ఆరుద్ర కార్తే అనువైనది. అందుకే ఈ కార్తేలో అరుదుగా కనిపించేవే ఆరుద్ర పురుగులు. ఈ పురుగులు మక్మల్ క్లాత్ ఓల్లంతా పెట్టుకున్నట్లుగా ఉండి ఎర్రగా, బుర్రగా, బొద్దుగా ఉంటుంది.

Next Story