- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయికృష్ణ మృతి.. మృతదేహం మాయంలో ఇద్దరి పాత్ర..?
విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ అధికారులు మరింత దూకుడు పెంచారు. ముమ్మరంగా విచారణ చేపట్టారు. ....

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు(Gade Saikrishna Missing Case)లో సిట్ అధికారులు మరింత దూకుడు పెంచారు. సాయికృష్ణను లాకెప్ డెత్ చేశారని గుర్తించి నిందితుడు మాజీ సీఐ నాగరాజు(Former CI Nagaraju)కు జైలుకు పంపించిన విషయం తెలిసిందే. అయితే సాయికృష్ణ ఆచూకీపై సిట్ అధికారులు ముమ్మరంగా విచారణ చేపట్టారు. కృష్ణలంక పోలీసులను ఇప్పటికే విచారించారు.
ఆ ఇద్దరే కీలక పాత్ర...?
అయితే ఇక్కడే కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్‌లోని స్టాఫ్ అంతా వాంగ్మూలాలు ఇచ్చారు. అయితే ఇద్దరు కానిస్టేబుళ్లు నాని, అశోక్ విధులకు హాజరుకాకపోవడం కొత్త అనుమానాలకు తావిచ్చింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సిట్ గుర్తించింది. విచారణకు పిలిచినా హెడ్ కానిస్టేబుల్ స్పందచలేదు. దీంతో సీఐ నాగరాజుకు ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు సహకరించారని భావిస్తున్నారు. సాయికృష్ణ మృతదేహం మాయం చేయడంలో నాని, అశోక్ పాత్ర ఉన్నట్లు అనుమానించారు. అలాగే బయట వ్యక్తి కూడా సహకరించినట్లు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది. ఆ ప్రైవేటు వ్యక్తి తరచూ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
ఆ ప్రైవేట్ వ్యక్తి ఎవరు..?
దీంతో అసలు అతను ఎందుకొచ్చేవాడనే కోణంలోనూ పోలీస్ స్టేషన్ సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు సాయికృష్ణ మృతిపై ఇప్పటి వరకూ నోరవిప్పకపోవడంతో సీఐ నాగరాజును మరింతగా విచారించాలని సిట్ అధికారులు యోచిస్తున్నారు. నాగరాజు సన్నిహితులను కూడా విచారించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సాయికృష్ణ మృతదేహం ఏమైందనే కోణంలో అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రతి ఎలిమెంట్ కూడా సంచలనంగా ఉండటంతో పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటోంది. ఈ మిస్టరీకి ఎలా తెరపడుతుందో చూడాలి.






