హైదరాబాద్‌ నగరాన్ని కామ్మెస్తున్న దట్టమైన మేఘాలు.. మరికొద్ది సేపట్లో భారీ వర్షం

by Malleboina Mahesh |

హైదరాబాద్‌లో మారిన వాతావరణం.. పటాన్‌చెరు, లింగంపల్లిలో మొదలైన వర్షాలు.. కాసేపట్లో సెంట్రల్, వెస్ట్ హైదరాబాద్‌కు విస్తరించే అవకాశం!

హైదరాబాద్‌ నగరాన్ని కామ్మెస్తున్న దట్టమైన మేఘాలు.. మరికొద్ది సేపట్లో భారీ వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: నగర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వర్షాలు ఎట్టకేలకు హైదరాబాద్ నగరాన్ని పలకరించాయి. ఉదయం నుంచి చల్లన వాతావరణం ఉండగా.. మధ్యాహ్నం సమయానికి దట్టమైన మేఘాలు నగరాన్ని కమ్మేశాయి. దీంతో నగరం అంతటా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఇప్పటికే నగర శివార్లతో పాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడ చెల్లాచెదురుగా వర్షాలు (Scattered Rains) ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా వైపు నుండి వస్తున్న మేఘాల కారణంగా పటాన్‌చెరు, అమీన్‌పూర్, దాని పరిసర ప్రాంతాలలో వానలు పడుతున్నాయి.

వాతావరణ అధికారుల నివేదికల ప్రకారం.. మరికొద్ది సేపట్లో పటాన్‌చెరు, లింగంపల్లి, ఆర్‌సి పురం (RC Puram) పరిసర ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత మధ్యాహ్నం 3:00 గంటల సమయానికి ఈ వర్షపు మేఘాలు సెంట్రల్, వెస్ట్ హైదరాబాద్ (మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాలు) వైపు విస్తరించే అవకాశం ఉంది. రాబోయే కొద్ది గంటల్లో నగరంలో మరికొన్ని చోట్ల కూడా వర్షాలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా (Stay Alert) ఉండాలని, బయటకు వెళ్లేవారు తమ ప్రయాణాలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Next Story