- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > తులేకాలన్ గ్రామంలో విషాదం.. ట్రాక్టర్ ఇనుప చక్రం మీద పడి చిన్నారి మృతి
తులేకాలన్ గ్రామంలో విషాదం.. ట్రాక్టర్ ఇనుప చక్రం మీద పడి చిన్నారి మృతి
by Taduka Kalyani |
ట్రాక్టర్ ఇనుప చక్రం మీద పడి చిన్నారి మృతి చెందిన విషాద ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, ఇబ్రహీంపట్నం : ట్రాక్టర్ ఇనుప చక్రం మీద పడి చిన్నారి మృతి చెందిన విషాద ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, తులేకలాన్ గ్రామనికి చెందిన జక్కుల లింగం, మాధవి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె అభిరామి(3) ఉన్నారు. శుక్రవారం ఇంటి పక్కన నిలిపివేసిన ట్రాక్టర్ ఇనుప చక్రాలు వద్ద ఆడుకుంటుండగా, ఒక్కసారిగా ఇనుప చక్రం చిన్నారి పై పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలిస్తుండగా, గురునానక్ కళాశాల సమీపంలోకి రాగానే మృతి చెందింది. దీంతో తులేకాలన్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సింది.
Next Story






