డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి

by Ratna Kumari |

మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు పిలుపునిచ్చారు.

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి
X

దిశ, హుజూర్‌నగర్ : మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హుజూర్‌నగర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో యాంటీ డ్రగ్ అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని పిఎస్ఆర్. సెంటర్ నుంచి శాంతి స్తూపం వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించి, అనంతరం ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.అనంతరం డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని, మత్తు పదార్థాల వినియోగాన్ని నిరోధించేందుకు కృషి చేస్తామని విద్యార్థులు, యువత, ప్రజలతో యాంటీ డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ విక్రయాలు, వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సీఐ కోరారు. ఈ కార్యక్రమంలో హుజూర్‌నగర్ ఎస్సై సిహెచ్.నరేష్, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

Next Story