- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల కార్డన్ సెర్చ్.. మద్యం స్వాధీనం- వాహనాల సీజ్
మహబూబాబాద్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అక్రమ కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

దిశ, దంతాలపల్లి, తొర్రూరు: మహబూబాబాద్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అక్రమ కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామంలో పోలీసులు భారీ ఎత్తున కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలోని పలు వీధులు, అనుమానాస్పద ప్రాంతాలు, నివాసాలు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సరైన రిజిస్ట్రేషన్, బీమా, తదితర పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను ఆర్టీఏ అధికారులకు అప్పగించి, పత్రాల పరిశీలన అనంతరం మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలు, గంజాయి, జూదం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ప్రజలు కూడా అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్డన్ సెర్చ్‌లో పోలీసులు, ప్రత్యేక బృందాలు పాల్గొని గ్రామంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దీంతో గ్రామంలో కొంతసేపు సందడి నెలకొంది. అధికారులు ఇలాంటి తనిఖీలు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా కొనసాగనున్నట్లు వెల్లడించారు.






