- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోంది: ఎమ్మెల్యే
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చి 50 ఏళ్లు సందర్భంగా బిజినేపల్లిలో ఘనంగా 'ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర' కొనసాగుతున్నది.

దిశ, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం ఆనాటి రోజుల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఎస్ టి లకు రిజర్వేషన్ ఇచ్చి 50 ఏళ్లు సందర్భంగా బిజినేపల్లిలో ఘనంగా 'ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర' కొనసాగుతున్నది. ఎస్టీలకు లంబాడీ, ఎరుకల, యానాది తదితర గిరిజన వర్గాలకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రిజర్వేషన్లు కల్పించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఆదివాసీ ప్రజాప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న 'ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర' స్థానిక ఎమ్మెల్యే నాగర్‌కర్నూల్ జిల్లా ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు.
ఇందిరా గాంధీ కల్పించిన ఎస్టీ రిజర్వేషన్లు..
అనంతరం నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించి ఉన్నత చదువులు చదివి దేశాలతో పోటీపడే విధంగా చదవాలని ఉద్దేశంతో విద్యను ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గిరిజన వర్గాల సామాజిక, విద్యా, ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ కల్పించిన ఎస్టీ రిజర్వేషన్లు గిరిజనుల అభ్యున్నతికి బాటలు వేశాయని, ఆ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మిద్దె రాములు మాన్య నాయక్ గోవిందు నాయక్ చిన్నప్పుడు సర్పంచ్ మునేందర్ నాయక్ కారుకొండ మల్లేష్ వెంకట్ స్వామి సైదులు పండ్లపాషా, ప్రవీణ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ తో పాటు పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.






