- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు.. అధికారిక ఉత్తర్వులు విడుదల
తెలంగాణ ప్రభుత్వ పాలనా వ్యవహరాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజు నియమితుయ్యారు. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ సంజయ్ జాజు ఇన్నాళ్లు డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసులలో ‘మినిస్ట్రీ ఆఫ్ డెవలప్‌మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్’ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆయనను ఇటీవలే పేరెంట్ కేడర్‌కు బదిలీ చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (DoPT) ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సీఎస్‌గా కొనసాగుతున్న కే.రామకృష్ణారావు పదవీ కాలం ఈనెల 30తో ముగియనుంది. ఈ క్రమంలోనే ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజును రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శగా (CS)గా నియమిస్తూ ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.






