అయోధ్య విరాళాల చోరీ కేసులో పెను సంచలనం.. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా

by Kema Shiva Kumar |

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

అయోధ్య విరాళాల చోరీ కేసులో పెను సంచలనం.. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటచేసుకుంది. దొంగతనం ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ (Champat Rai)తో పాటు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా (Anil Mishra) ఇవాళ తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరి రాజీనామా నిర్ణయం జాతీయ రాజకీయాల్లో, ఆధ్యాత్మిక వర్గాల్లో పెను సంచలనంగా మారింది. అయితే, ఈ విరాళాల చోరీ కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణను వేగవంతం చేసిన తరుణంలోనే వారు రాజీనామాలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

అదేవిధంగా ఇటీవలే చంపత్ రాయ్ వ్యక్తిగత డ్రైవర్ టిన్నూ యాదవ్‌ను యూపీ పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేశారు. ట్రస్ట్‌కు వచ్చిన విరాళాల లెక్కింపు ప్రక్రియ, నిధుల నిర్వహణలో డ్రైవర్ హస్తం ఉన్నట్లుగా, లెక్కింపు గదిలో అక్రమాలు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. డ్రైవర్ అరెస్ట్ తర్వాత విచారణ నేరుగా ట్రస్ట్ పెద్దల వైపు తిరిగే అవకాశం ఉండటంతోనే, జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ వీరిద్దరూ తమ పదవుల నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

Next Story