- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి:ఏసీపీ తిరుపతిరెడ్డి
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు.

దిశ, ఖమ్మం రూరల్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం , అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం వారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం రూరల్ సబ్-డివిజన్ స్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పోలీసులు “Say No To Drugs – Say Yes To Life” అనే సందేశంతో ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏసీపీ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని, సమాజంలో అనేక సమస్యలకు దారితీస్తుందని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీతో పాటు హెల్మెట్ ధరించడం పై ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ ఎస్‌హెచ్‌ఓ ముష్క రాజు, డివిజన్ స్థాయి పోలీసు అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






