- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సమయంలో ఆకాశంలో అద్భుతం.. అస్సలు మిస్సవకండి!
ఆకాశంలో ఈ రోజు(శనివారం) అద్భుతం జరగబోతుంది.

దిశ,వెబ్‌డెస్క్: ఆకాశంలో ఈ రోజు(శనివారం) అద్భుతం జరగబోతుంది. అంతరిక్షంలో చాలా మార్పులు జరుగుతుంటాయనే విషయం తెలిసిందే. ఈ మార్పుల వల్ల ‘సూపర్ మూన్స్’ (Supermoon) కనువిందు చేస్తుంటాయి. గత ఏడాది(2025)లో మొత్తం 8 సూపర్ మూన్స్ దర్శనమిచ్చాయి. సూపర్ మూన్ అంటే చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు చంద్రుడి ప్రతిబింబం కాస్త పెద్దదిగా కనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే.. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి చంద్రుడు భూమికి కేవలం 3.6 లక్షల కిలోమీటర్ల దూరంలోకి వస్తాడని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తరుణంలో పౌర్ణమి కూడా కావడంతో, చంద్రుడు పరిమాణంలో సాధారణం కంటే 15 శాతం పెద్దగా.. సుమారు 30 శాతం అధిక ప్రకాశవంతంగా కనిపిస్తాడు.
ఈ సూపర్ మూన్ ఏర్పడడం వెనుక ఒక ఆసక్తికరమైన సైన్స్ దాగి ఉంది. అదేంటంటే.. భూమి(Earth)కి 3.6 లక్షల కి.మీ దూరంలో చందమామ ఉంటాడు. ఈ క్రమంలో భూమికి దగ్గరగా చంద్రుడు(Moon) రావడం, అదే టైమ్ లో సూర్యుడికి భూమికి దగ్గరగా ఉండటం, సూర్యుడి(Sun)కి చంద్రుడు పూర్తి ఎదురుగా రావడంతో సూపర్ మూన్ వెలిగిపోనుంది. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి ఎటువంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేదని నేరుగా కళ్ళతోనే చూడొచ్చని చెబుతున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే వారికి ఈ సూపర్ మూన్(Supermoon) ప్రభావం వల్ల అలల ఉధృతి సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.






