తీవ్ర స్థాయికి చలి.. రేపు ఉదయం దట్టమైన పొంగమంచు

by Muthe.Rajitha |

తెలంగాణలో చలి తీవ్ర స్థాయికి చేరుకుంది.

తీవ్ర స్థాయికి చలి.. రేపు ఉదయం దట్టమైన పొంగమంచు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో చలి తీవ్ర స్థాయికి చేరుకుంది. రేపు అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని, ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేకువజామున ప్రయాణాలు చేసేవారు, ముఖ్యంగా హైవేలపై వాహనాల్లో ప్రయాణించేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కోల్డ్ వేవ్ కొనసాగుతుందని, మధ్య రాత్రి నుంచి పూర్తిగా తెల్లవారే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అవసరం అయితే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించారు.

Next Story